నారాయణపేట మార్కెట్ యార్డులో గురువారం దొడ్డు రకం వరి ధాన్యం క్వింటాకు గరిష్టంగా రూ. 1, 740 కనిష్టంగా రూ. 1, 700 ధర పలికిందని మార్కెట్ సెక్రటరీ భారతి తెలిపారు. సన్న రకం వరి గరిష్టంగా క్వింటాలుకు రూ. 2, 634, కనిష్టంగా 1, 900, ఎర్ర కందులు గరిష్టంగా 8, 7400 కనిష్టంగా 7, 000, తెల్ల కందులు గరిష్టంగా రూ. 9, 100, కనిష్టంగా రూ. 8, 200 ధర పలికిందని చెప్పారు. క్రయవిక్రయాలు సజావుగా సాగుతున్నాయని అన్నారు.