రేపు ప్రత్యేక బడ్జెట్ సమావేశం

1102చూసినవారు
రేపు ప్రత్యేక బడ్జెట్ సమావేశం
రేపు అనగా శనివారం మున్సిపల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహిస్తున్నట్లు నారాయణపేట మున్సిపల్ కమిషనర్ సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్ పర్సన్ గందే అనసూయ చంద్రకాంత్ అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 10: 30 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాలులో సమావేశం ఉంటుందని, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, అధికారులు సమయానికి హాజరు కావాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్