వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావు పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాల మధ్యన కోలాటం ఆటపాటలతో ఘనంగా స్వాగతం పలికారు.