పీహెచ్సిలలో ప్రసవం జరిపించే విధంగా చూడాలి: కలెక్టర్

65చూసినవారు
పీహెచ్సిలలో ప్రసవం జరిపించే విధంగా చూడాలి: కలెక్టర్
వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎన్సీ, ఈడీడీ రిజిస్టర్లను పరిశీలించారు. మొదటి త్రైమాసికంలో నమోదు చేసిన గర్భిణీలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ. సమయానికి వైద్యం అందిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే ప్రసవం జరిపించే విధంగా చూడాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్