వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక పూజలు

563చూసినవారు
శ్రావణమాసం చివరి శనివారం పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వనపర్తి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవున్ని మొక్కుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్