దేశానికి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు

74చూసినవారు
దేశానికి ఆదర్శం నారా చంద్రబాబు నాయుడు
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దేశానికి ఆదర్శమని టీడీపీ నేత బోల్లెమోని రాములు అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాములు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎంగా బాబు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి పరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవులశ్రీను, చిన్నయ్య, లక్ష్మయ్య, బాలయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్