మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

66చూసినవారు
వనపర్తి మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం బుధవారం ప్రమాణస్వీకారం చేసింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు పదవీ ప్రమాణం చేశారు. ముందుగా ఎమ్మెల్యే, చైర్మన్ దేవతల చిత్రపటాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చీర్ల చందర్, సతీష్, శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్