వనపర్తి జిల్లాలో టాలీవుడ్ సినీ ప్రేమ జంట పెళ్లి

1530చూసినవారు
వనపర్తి జిల్లాలో టాలీవుడ్ సినీ ప్రేమ జంట పెళ్లి
చాలా కాలంగా ప్రేమలో ఉన్న టాలీవుడ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితులతో పెళ్లి జరిగింది. కాగా వనపర్తి చివరి సంస్థానాధీశులు రాజా రామేశ్వర రావు మనుమరాలే అదితి రావు హైదరీ కావడం విశేషం. రంగనాథ స్వామి ఆలయంలోనే సిద్ధార్థ్, అదితిల వివాహం జరగడం మరో విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్