వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలన్నారు. అవకతవకలు జరగకుండా ఆన్ లైన్ చేయాలని అన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతుల వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని, తూకం పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠినచర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు.