గ్రూప్-4 పరీక్షలలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సీఎం యెనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం నియామక పత్రాలు అందుకునేందుకు పెద్దపల్లి జిల్లాకు బయలుదేరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి డిఆర్డిఓ ఉమాదేవి, ఏఓ భాను ప్రకాష్ 179మంది అభ్యర్థులను నాలుగు ప్రత్యేక బస్సులలో జెండా ఊపి ప్రారంభించారు.