వనపర్తి సంస్థానాధిశులు రాజా శ్రీకృష్ణ దేవరావు, యువరాజా ఆరుద్ర దేవరావులను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిసి రాజావారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జిల్లా సంబంధించిన పలు అంశాలపైన, రానున్న విజయదశమి ఉత్సవాల ఏర్పాటుపైన చర్చించారు. అభివృద్ధి అంశాలపై తాను ఎల్లవేళలా అండదండగా ఉంటానని రాజావారు తెలిపారు. మాజీ ఎంపీపీ సత్య శీలారెడ్డి, మణిగిల్ల తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.