వనపర్తి జిల్లా ఖిల్లా ఘాణపురం మండలం సల్కెలాపురం గ్రామంలో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భూమి పూజ నిర్వహించి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.