గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన రూ. 7, 500 కోట్ల రైతుబంధు ఇవ్వలేక చేతులెత్తేశారు. రూ. 30 వేల కోట్ల బోనస్ ఎలా ఇస్తారని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ. రైతు బంధు ఎగవేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, ఎంత మందికి బోనస్ ఇచ్చారని, ప్రభుత్వం తడిగుడ్డతో రైతుల గొంతులు కోస్తోందన్నారు. అబద్ధాల హామీలతో అధికారం చేపట్టి ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.