నేడు, రేపు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ

69చూసినవారు
నేడు, రేపు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ
TG: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై సోమ, మంగళవారాల్లో పలువురిని జస్టిస్ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణ చేయనుంది. ఈ దఫా ఏఈఈ స్థాయి మొదలు..పైస్థాయి ఇంజినీర్ల వరకు విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ ఘోష్ మరికొందరిని ప్రశ్నించేందుకు పిలిచినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించిన ఇంజినీర్లను విచారించి వారినుంచి ప్లేస్మెంట్ రిజిస్టర్లు, ఆధారపత్రాలను కమిషన్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్