10వ తరగతి ఫలితాలలో వనపర్తి జిల్లా 86. 93% ఉత్తీర్ణత: డిఈఓ

85చూసినవారు
10వ తరగతి ఫలితాలలో వనపర్తి జిల్లా 86. 93% ఉత్తీర్ణత: డిఈఓ
10వ తరగతి ఫలితాలలో వనపర్తి జిల్లా విద్యార్థులు 86. 93% ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి గోవింద రాజులు తెలిపారు. డిఈఓ మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే 5% ఎక్కువ ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. జిల్లా నుండి 6888మంది విద్యార్థులు గాను 5988మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. జిల్లాలోని బిసి సంక్షేమ శాఖ వసతి గృహాలలో ఉన్న 297 మందికి 297 మంది విద్యార్థులు పాస్ అయినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్