సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని పిలుపునిచ్చిన తొలి పార్టీ సిపిఐ అని వనపర్తి జిల్లా సిపిఐ కార్యదర్శి విజయ రాములు పేర్కొన్నారు. వనపర్తి జిల్లా సిపిఐ కార్యాలయంలో సిపిఐ శతాబ్ద ఆవిర్భావ వేడుకలు ఘనంగానిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ. 1925 డిసెంబర్ 26 న యూపీలో సిపిఐ ఆవిర్భవించిందన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాలను పేదలకు పంచిందని అయన గుర్తు చేశారు.