15 శాతం ఎస్సీ జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వనపర్తి జిల్లా మాదిగ జాగృతి సంఘం ఎంజేఎస్ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఎస్సి చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సి వర్గీకరణ ఏక సభ్య కమీషన్ జస్టిస్ శమీమ్ అక్తర్ కు వినతిపత్రం అందజేశారు. ఎస్సి జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభాకు 10%, 30% లోపు ఉన్న మాలలకు 4%, మిగిలిన 1% లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని అన్నారు.