నీళ్లు లేక విద్యార్థుల ఇబ్బందులు

66చూసినవారు
నీళ్లు లేక విద్యార్థుల ఇబ్బందులు
వనపర్తి జిల్లా కేంద్రం ఇందిరా కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నీటి వసతి లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత దాహం తీర్చుకోవడానికి, తిన్న ప్లేట్లు కడగడానికి నీళ్లు లేక వీధిలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని బుధవారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వనపర్తి శాఖ తరపున కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్