మహాశివరాత్రి… గర్భగుడిలోని శివుడు మాయం(వీడియో)

57చూసినవారు
గుజరాత్‌లోని దేవభూమి ద్వారకా జిల్లాలో పండుగ పూట షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి ముందు రోజే గుర్తు తెలియని వ్యక్తులు గర్భగుడిలోని శివలింగాన్ని మాయం చేశారు. పునాదితో సహా పెకలించి తీసుకెళ్లారు. రాత్రి తాళం వేసి వెళ్లిన పూజారులు ఉదయం వచ్చి చూసే సరికి గర్భగుడిలో శివలింగం లేకపోవడంతో షాక్ అయ్యారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్