భారత్ లోనూ త్వరలోనే ‘హైపర్ లూప్’ రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇది సాకారం అయితే గంటల ప్రయాణాన్ని నిమిషాల్లోకి తగ్గించవచ్చు. ఈ రవాణా వ్యవస్థ సాధ్యసాధ్యాలను పరిశీలించడానికి రైల్వే మంత్రిత్వశాఖ ఇటీవల మద్రాస్ ఐఐటీ సహకారం తీసుకుంది. ఇందులో భాగంగా 400 మీటర్ల పొడవైన ట్రాక్ సిద్ధం చేశారు. ఇది విజయవంతమైతే భారత్‌లో కూడా త్వరలోనే అత్యంత వేగవంతమైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.