మహాశివరాత్రి రోజు ఆయా రాశుల వారు ఆ మంత్రాలు పఠిస్తే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
• మేషరాశి వారు పరమేశ్వరునికి నీటితో అభిషేకం చేసి, ఓం నాగేశ్వరాయ నమః మంత్రాన్ని జపించాలి.
• వృషభ రాశి వారు ఓ నమఃశివాయ, మిధున రాశి వారు రుద్రాష్టకం పఠించాలి. కర్కాటక రాశి వారు శివుడికి పాలతో అభిషేకించి శివ చాలీసా, సింహ రాశి వారు పంచాక్షరి మంత్రాన్ని చదవాలి.
• కన్యా రాశి వారు శివాష్టకం, తులా రాశి వారు పంచాక్షరి మంత్రం పఠించాలి. వృశ్చిక రాశి వారు ఓ పార్వతీ నాథాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలని పండితులు సూచిస్తున్నారు.
• ధనుస్సు రాశి వారు ఓం అంగరేశ్వరాయ నమః, మకర రాశి వారు ఓ భమేశ్వరాయ నమః, కుంభ రాశి వారు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. మీన రాశి వారు శివాష్టకం పఠిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు.