ఆ థియేటర్‌ను మల్టీప్లెక్స్‌గా మార్చనున్న మహేశ్‌బాబు

577చూసినవారు
ఆ థియేటర్‌ను మల్టీప్లెక్స్‌గా మార్చనున్న మహేశ్‌బాబు
ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్‌లుగా మారిపోతున్నాయి. ఈ క్రమంలో HYDలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో పేరొందిన థియేటర్స్‌లో ఒకటైన సుదర్శన్ థియేటర్ మల్టీప్లెక్స్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకుని మహేశ్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా AMB క్లాసిక్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్