వేర్వేరు స్కాముల్లో నష్టపోయిన బాధితులకు ఈడీ రూ.22,280CR పరిహారం ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ LSకు తెలిపారు. విజయ్ మాల్యా ఆస్తుల నుంచి రూ. 14,000CRను బ్యాంకులకు బదిలీ చేసిందన్నారు. నీరవ్ మోదీ రూ.1052CR, హీరా గ్రూప్ రూ.226CR, మెహుల్ చోక్సీ రూ.2565CR, రోజ్ వ్యాలీ గ్రూప్ రూ.19CR, సూర్యా ఫార్మా నుంచి రూ.185CR రికవరీ చేసిందన్నారు. దేశం నుంచి పారిపోయినా తాము వదిలిపెట్టడం లేదన్నారు.