దళితుడిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్ (వీడియో)

5815చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో ఓ దళితుడిపై మూత్ర విసర్జన చేసిన కేసులో నిందితుడు ప్రవీణ్ శుక్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు నేషనల్ సెక్యూర్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దళితుడిపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో వైరల్ కావడంతో పోలీసులు శుక్లా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు శుక్లా తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్