TG: ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి గ్రామసభలో పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్ననానికి పాల్పడ్డాడు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని పురుగులమందు తాగిన నాగేశ్వరరావును చికిత్స కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.