ఓ వ్యక్తి శరీరంపై బాంబు పెట్టి కొందరు దారుణంగా చంపారు. ఈ ఘటన ఉత్తర గాజా స్ట్రిప్‌లోని చోటుచేసుకుంది. భూ-వివాదం కారణంగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాజాకు చెందిన ఒక పాలస్తీనియన్ శరీరంపై జియోనిస్ట్‌లు అమెరికాలో తయారు చేసిన బాంబును అమర్చి నడిరోడ్డుపై చంపేశారు. స్థానికులు యువకుడ్ని కాపాడటానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.