ఆంధ్రప్రదేశ్ లో ఫెంగల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో రేపు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు ప్రకటించారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కూరుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా సెలవు ఇచ్చారు. అటు నెల్లూరు, తిరుపతి, YSR జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.