బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దానాపూర్ జిల్లా పాట్నాలోని దౌద్‌పూర్‌లో రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని మరణానికి ముందు ఇద్దరు గ్రామస్తులు అతనికి ఫోన్ చేసి, బయటకు తీసుకెళ్లారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చర్యలు చేపట్టారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.