సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు స్కూల్ యూనిఫాంలో ఉన్న విద్యార్థులు మహీంద్రా XUV700 కారులో ట్రాఫిక్‌లో చక్కర్లు కొట్టారు. సుమారు ఐదుగురు విద్యార్థులు కారులో ప్రయాణిస్తూ కనిపించారు. అందులోని ఓ బాలుడు రద్దీగా ఉన్న రహదారిపై స్వయంగా కారు నడుపుతూ కనిపించాడు. వీరందరూ 13, 14 ఏండ్ల వయసున్న పిల్లలే. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.