ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు తమ ట్రాక్టర్ల శక్తిని చూపించేందుకు ప్రయత్నించగా జరిగిన అపశృతిలో ఓ డ్రైవర్ తన ప్రాణాలు కోల్పోయాడు. రెండు ట్రాక్టర్లను వెనక్కి తిప్పి వాటి మధ్య తాడు కట్టి లాగుడు పందెం పెట్టారు. ఈ క్రమంలో ఓ ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రం విషాదం నింపింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.