అంతరిక్ష కేంద్రంలో భారత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు కీలక అడుగులు పడ్డాయి. స్పేస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్ర మోదీ అనుమతించినట్లు అందుకు సంబంధించిన పనులు శరవేగంగా చేయాలని సూచించినట్టు ఇస్రో నూతన చీఫ్ నారాయణన్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇస్రో విజయవంతమైన దశలో వెళ్తోందన్నారు. ‘గగన్‌యాన్’ ప్రస్తుతం ఇస్రో ముందున్న అతిపెద్ద లక్ష్యం అని పేర్కొన్నారు.