యూపీలోని మొరాదాబాద్ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో ఒక ట్రాక్టర్‌ను పోలీసులు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ ట్రాక్టర్ బోల్తా పడి సోను అనే వ్యక్తి మరణించాడు. దీంతో పోలీసులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఠాకూర్‌ద్వారా-జస్పూర్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. నిరసనను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నించగా.. గ్రామస్తులు రాళ్లు, కర్రలతో వారిపై దాడి చేశారు. దీంతో పోలీసులు పరుగులు తీశారు.