ప్రముఖ కథా, నవలా రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్(80) కన్నుమూశారు. విజయవాడలోని స్వగృహంలో గుండెపోటుతో నిన్న చనిపోయారు. సాహిత్యంపై ఆసక్తితో 11 ఏళ్లకే రచనా ప్రస్థానం ప్రారంభించారు. 1974లో తొలి కథ ప్రచురితమైంది. 600కు పైగా కథ, కథానిక, నవల, నవలిక, హరికథ, నాటకాలు, 400కు పైగా వ్యాసాలు రాశారు. సైనికుడిగా 1965, 1971లో భారత్-పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. హైకోర్టు లాయరుగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు.