AP: రాజధాని అమరావతి నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో రూ.45వేల కోట్లతో పనులు చేపట్టేందుకుగానూ టెండర్లు పిలించేందుకు అథారిటీ అనుమతిచ్చిందని ఆయన వెల్లడించారు. గురువారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, అధికారులకు 3600 నివాసాలు, సుమారు 3వేల కిలోమీటర్ల ట్రంకోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.