ఇటీవల కాలంలో చాలా మంది బర్త్ డే వేడుకను వినూత్నంగా జరుపుకుంటున్నారు. ఇదే కోవలో అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్ కొండచిలువల మధ్య పడుకుని పుట్టినరోజు జరుపుకున్నారు. 'ది రెప్టైల్ జూ'ను ఆయన స్థాపించారు. ఆ కొండచిలువలను ఆయన సొంత బిడ్డల్లా పెంచుతున్నారు. అయితే ప్రమాదకరకమైన ఆ కొండచిలువల మధ్య ఆయన ఏ మాత్రం భయం లేకుండా సంచరిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.