నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువతిపై తీవ్ర దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ధ్రువ్ రాథీ ఫేర్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగినట్టు తెలుస్తోంది. ఓ వ్యక్తి యువతిపై తీవ్రంగా దాడి చేశాడు. కాలితో తన్నుతూ ఆమెపై విరుచుకుపడ్డాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఏదైనా యువతిని నడిరోడ్డుపై ఇలా కొట్టడం దారుణమని కామెంట్లు చేస్తున్నారు.