తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయాన్’ ఇప్పటికే సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాని జై భీమ్ దర్శకుడు టి.జె జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా, రజినీకాంత్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ‘మనసిలాయో’ తమిళ్ లిరికల్ పాటను విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.