బెల్లంపల్లి పట్నంలోని మహాత్మ జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల స్కూల్ లో శనివారం కామన్ డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఏర్పాటు చేసిన కామన్ డైట్ మెనూ పెంపు పై తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేసారు.