సింగరేణి ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి డిస్పెన్సరీ రలో శనివారం వెల్ బేబీ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్లు చేయించాలన్నారు. పిల్లలకు సెల్ ఫోన్ దూరంగా ఉంచాలన్నారు. ఎంపికైన చిన్నారులకు ఈనెల 23న బహుమతులు ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.