మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 2వ వార్డులో 2 లక్షల రూపాయలతో బూర్ల సమ్మయ్య ఇంటి వద్ద నుండి మెయిన్ రోడ్డు వరకు సిసి రోడ్డు పనులను గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కౌన్సిలర్ షేక్ అఫ్సర్ లు ప్రారంభించారు. వార్డులో సిసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, బస్తీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.