బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని బుధవారం బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డులు, దవాఖాన పరిసరాలను ఆయన విస్తృతంగా పరిశీలించారు. ఆస్పత్రి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.