సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణ కోసమే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డిసిపి భాస్కర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 38 వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించారు.