పట్టణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ వేడుకలు

1224చూసినవారు
పట్టణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ వేడుకలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో స్వామి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా హొలీ సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, ప్రజా ప్రజాప్రతినిధులు, బెల్లంపల్లి సర్కిల్ ఎస్ఐ లు , మార్వాడీ సంఘము, వ్యాపారస్తులు పెద్ద సంఖ్యలో హొలీ సంబరాల్లో పాల్గొన్నారు. హోలీ పండుగ సందర్భంగా ఒకరికొకరు రంగులు చల్లుకుని, ప్రజలంతా అలాయ్ బలాయ్ తీసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి సంతోషంగా గడిపే పండుగ హోలీ పండుగని అన్నారు. ఈ హోలీ పండుగతో ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాలని వారు ఆకాంక్షించారు. డీజే పాటలకు చిన్న పిల్లలతో కలసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చిందులు వేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్