ఆటో యూనియన్ సంఘాల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండడంతో ముందస్తు చర్యగా ఎక్కడికక్కడ యూనియన్ సంఘాల అధ్యక్షులను అరెస్ట్ చేస్తున్నారు. కన్నెపల్లిలో మండల జేఏసీ అధ్యక్షుడు అంజన్నను శుక్రవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. మా అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. భవిష్యత్తులో మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, శేఖర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.