బెల్లంపల్లి పట్టణంలోని 25 వ వార్డు రడగంబాల బస్తీలోని జాతికుంట చెరువు తూముకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేశారు. ఇటీవల జాతికుంట చెరువు నీటితో రైల్వే క్వార్టర్స్ ముంపునకు గురికాగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో తూముకు మరమ్మత్తు చేసి నీటిని వదిలారు. దీంతో 25, తొమ్మిదో వార్డు ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.