వేమనపల్లి: ఆదివాసులపై దాడి హేయమైన చర్య

64చూసినవారు
వేమనపల్లి: ఆదివాసులపై దాడి హేయమైన చర్య
ఆదివాసులపై దాడి హేయమైన చర్య అని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వర్మ పున్నం అన్నారు. గిరిజనులతో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. కళ్లెంపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు రవీందర్ లక్క కోసం ఈనెల 15న అడవికి వెళ్లగా అటవీ అధికారులు దాడి చేశారన్నారు. ఈ విషయంపై నిల్వాయి పోలీస్ స్టేషన్ లో బాధితుడు రవీందర్ ఫిర్యాదు చేశారన్నారు.

సంబంధిత పోస్ట్