వేమనపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు పథకాలు

50చూసినవారు
వేమనపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు పథకాలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుపేదలకు పథకాలు అందుతున్నాయని వేమనపల్లి మాజీ జడ్పీటీసీ ఆర్ సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ పేర్కొన్నారు. మంగళవారం సుంపుటం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా పథకాలకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక నిమిత్తం ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్