ఆక్రమణలపై అధికారుల కొరడా

54చూసినవారు
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రహదారులను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝులిపించారు. వీధులలో రహదారులు, కాలువలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జెసిబితో కూల్చివేశారు. అధికారులు మాట్లాడుతూ, రహదారులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల మేరకే నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్