కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. భీమారం మండలం ఎలకేశ్వర్ గ్రామానికి చెందిన మడే మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆదివారం వారి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.