మందమర్రి బస్టాండ్ జగదాంబ షాపు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో మంచినీరు వృధాగా పోతుంది. నీరు లీకై పైన ఉన్న విద్యుత్ తీగలపై పడే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు చేపట్టి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.